
హైదరాబాద్, వెలుగు: ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ హజూర్ మల్టీ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ (హెచ్‌ఎంపీఎల్) ఆంధ్రప్రదేశ్‌లో రూ.2,500 కోట్ల పెట్టుబడితో 500 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్‌ను నిర్మించడానికి ముందుకొచ్చింది. ప్రకాశం జిల్లాలో 2 వేల ఎకరాల్లో ప్లాంట్‌ను ఏర్పాటు చేయడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రపోజల్ సబ్మిట్ చేసింది. రోడ్డు ప్రాజెక్ట్‌లను నిర్మించే హజూర్ మల్టీ ప్రాజెక్ట్స్ కిందటి వారం రెన్యూవబుల్ ఎనర్జీ సెక్టార్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. మధ్యప్రదేశ్‌లో 4,200 ఎకరాల్లో 1.2 గిగావాట్ల క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టులను నిర్మించే పనిలో ఉంది.