
హైదరాబాద్, వెలుగు: హెచ్‌సీఎల్ టెక్, పియర్సన్ సంస్థలు ఏఐ స్కిల్స్‌ను పెంపొందించడానికి, నైపుణ్యాల కొరతను తీర్చడానికి ఒక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రకటించాయి. దీనిద్వారా, ఇరు సంస్థలు ఏఐ -ఆధారిత లెర్నింగ్ సొల్యూషన్లను రూపొందించడానికి, కెరీర్ ఎదుగుదలకు తోడ్పడటానికి, సంస్థలు వేగంగా మారుతున్న టెక్నాలజీలకు అనుగుణంగా మారడానికి సహకరిస్తాయి. పియర్సన్ తన ప్రపంచ స్థాయి లెర్నింగ్ టెక్నాలజీలను హెచ్‌సీఎల్‌టెక్ డిజిటల్, ఏఐ ఇంజనీరింగ్ సామర్థ్యాలతో కలిపి, ఏఐ- శక్తితో కూడిన కొత్త ప్రొడక్టులను అభివృద్ధి చేయనుంది. ఇవి గ్లోబల్ వర్క్‌ఫోర్స్‌ను భవిష్యత్తు కోసం సిద్ధం చేయడంలో సహాయపడతాయి.