భారతదేశంపై అనుచిత వ్యాఖ్యలు.. సింగర్ చిన్మయిపై HCU విద్యార్థి ఫిర్యాదు

భారతదేశంపై అనుచిత వ్యాఖ్యలు.. సింగర్ చిన్మయిపై HCU విద్యార్థి ఫిర్యాదు

ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద(Chinmai Sripadha)పై గచ్చిబౌలి పోలీసు స్టేషన్ లో కేసు నమోదయ్యింది. ఇటీవల భారతదేశం పట్ల, ఇక్కడి ఆడవారి పట్ల ఆమె చేసిన అగౌరవమైన, అనుచిత వ్యాఖ్యలను కండిస్తూ..HCU విద్యార్థి కుమార్ సాగర్(Kumar sagar) ఫిర్యాదు చేశారు. ఇటీవల సీనియర్ నటి అన్నపూర్ణమ్మ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలకి కౌంటర్ ఇస్తూ.. భారతదేశాన్ని స్టుపిడ్ కంట్రీగా, భారత దేశంలో పుట్టడం నా కర్మా అంటూ అణిచిత వ్యాఖలు చేశారు చిన్మయి శ్రీపాద.

ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ HCU విద్యార్థి కుమార్ సాగర్ గచ్చిబౌలి పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. మీరు అన్నపూర్ణమ్మకి ఏదైనా చెప్పలనుకుంటే అమే గురించి మాత్రమే మాట్లాడండి, మధ్యలో మన భారతదేశాన్ని తక్కువ చేసి మాట్లాడడం పద్ధతి కాదు. ఈ దేశంలో ఉంటూ, ఇక్కడి సౌకర్యాలు అనుభవిస్తూ.. భారతదేశంలో పుట్టడమే కర్మ అనడం, ఇదొక ఒక చెత్త దేశం అనడం బాధ, కోపాన్ని కలిగించేలా ఉన్నాయి. బాధ్యత గల పౌరుడిగా నా దేశంపై చేసిన అగౌరవమైన, అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ ఈ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వెంటనే సింగర్ చిన్మయి శ్రీపాదపై చర్యలు తీసుకోవాలని పోలీసువారిని కోరడం జరిగింది... అంటూ ఫిర్యాదులో తెలిపారు HCU విద్యార్థి కుమార్ సాగర్.