కర్ణాటక ఎన్నికలు : తొలి అభ్యర్థిని ప్రకటించిన జేడీఎస్

కర్ణాటక ఎన్నికలు : తొలి అభ్యర్థిని ప్రకటించిన జేడీఎస్

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డి కుమారస్వామి కుమారుడు, జేడీఎస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు నిఖిల్ కుమారస్వామి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో నిఖిల్ ... రామనగర నియోజకవర్గం నుండి పోటీ చేయనున్నట్లుగా అధిష్టానం వెల్లడించింది. దీంతో వచ్చే ఏడాది జరగాల్సిన రాష్ట్ర ఎన్నికలకు అభ్యర్థిని ప్రకటించిన మొదటి రాజకీయ పార్టీగా జేడీఎస్ నిలిచింది. ప్రస్తుతం రామనగర సెగ్మెంట్ నుంచి కుమారస్వామి భార్య అనిత కుమారస్వామి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 

దేవెగౌడ 1994లో రామనగర అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించగా, కుమారస్వామి 2004, 2008, 2013, 2018లో అక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2018లో జరిగిన ఉపఎన్నికలో అనిత కుమారస్వామి  గెలిచారు.  ఇక తెలుగులో నిఖిల్ గౌడ జాగ్వార్‌ అనే సినిమాలో నటించాడు. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చి మాండ్య లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీచేసి సినీ నటి సుమలత అంబరీష్ చేతిలో ఓడిపోయారు.