
న్యూఢిల్లీ: హెచ్డీఎఫ్సీ బ్యాంకు డిసెంబరుతో ముగిసిన మూడో క్వార్టర్లో భారీగా డిపాజిట్లను, లోన్లను సాధించింది. దేశీయ రిటైల్ లోన్లు 2021 డిసెంబర్ 31 నాటికి దాదాపు 21.5శాతం, 2022 సెప్టెంబర్ 30 నాటికి దాదాపు 5.0శాతం పెరిగాయి. వాణిజ్య & గ్రామీణ బ్యాంకింగ్ లోన్లు 2021 డిసెంబర్ 31 నాటికి దాదాపు 30 శాతం, 2022 సెప్టెంబర్ 30 నాటికి దాదాపు 5.0శాతం పెరిగాయి. కార్పొరేట్ & ఇతర హోల్‌సేల్ లోన్లు 2021 డిసెంబర్ 31 కంటే దాదాపు 20 శాతం పెరిగాయి. ఇవి 2022 సెప్టెంబర్ 30 కంటే దాదాపు 1.0శాతం తగ్గాయని బ్యాంక్ ఎక్స్ఛేంజీలకు తెలియజేసింది. బ్యాంక్ డిపాజిట్లు 2021 డిసెంబర్ 31 నాటికి రూ.14,459 బిలియన్లతో పోలిస్తే 2022 డిసెంబర్ 31 నాటికి దాదాపు 19.9శాతం (వార్షికంగా) రూ.17,335 బిలియన్లకు పెరిగాయి. డిపాజిట్లు కిందటి సెప్టెంబర్ 30 నాటికి మూడు శాతం పెరిగి రూ.16,734 బిలియన్లకు చేరాయి. రిటైల్ డిపాజిట్లు దాదాపు రూ.670 బిలియన్లు పెరిగాయి. ఇవి 2021 డిసెంబర్ 31 కంటే దాదాపు 21.5శాతం, 2022 సెప్టెంబర్ 30 కంటే దాదాపు 5 శాతం పెరిగాయి. టోకు డిపాజిట్లు 2021 డిసెంబర్ 31 కంటే దాదాపు 11.5శాతం పెరిగాయి, 2022 సెప్టెంబర్ 30 కంటే దాదాపు 2.5శాతం తగ్గాయని బ్యాంక్ తెలిపింది. బ్యాంక్ కాసా నిష్పత్తి డిసెంబర్ 31, 2022 నాటికి 44శాతం, 2021 డిసెంబర్ 31 నాటికి 47.1శాతం, 2022 సెప్టెంబర్ 30 నాటికి 45.4శాతం ఉంది. డిపాజిట్లు 2022 డిసెంబర్ 31 నాటికి సుమారు రూ. 7,630 బిలియన్లకు చేరాయి. 2021 డిసెంబర్ 31 నాటికి రూ. 6,812 బిలియన్లుగా ఉన్నాయి. అంటే దాదాపు 12.0శాతం గ్రోత్ కనిపించింది. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి రూ. 7,597 బిలియన్లకు చేరాయి. బ్యాంక్ హెచ్డీఎఫ్సీ నుండి రూ.88.92 బిలియన్ల విలువైన లోన్లను కొనుగోలు చేసింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తన పేరెంట్కంపెనీ హెచ్‌డీఎఫ్‌సీతో విలీనం అవుతామని ప్రకటించింది.