హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​ ప్రపంచంలోనే..7వ పెద్ద బ్యాంక్

హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​ ప్రపంచంలోనే..7వ పెద్ద బ్యాంక్

ముంబై:  హెచ్‌‌‌‌‌‌‌‌డీఎఫ్​సీ బ్యాంక్ సోమవారం 100  బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్​ సాధించింది. దీంతో ఇది ప్రపంచంలోనే ఏడవ అతిపెద్ద బ్యాంకుగా నిలిచింది. మార్కెట్​వాల్యూ దాదాపు 151 బిలియన్ డాలర్ల (రూ. 12.38 లక్షల కోట్లు)కు చేరింది. హెచ్​డీఎఫ్​సీ ఇప్పుడు మోర్గాన్ స్టాన్లీ,  బ్యాంక్ ఆఫ్ చైనా వంటి బడా బ్యాంకులను మించిపోయింది.   జేపీ మోర్గాన్ (438 బిలియన్), బ్యాంక్ ఆఫ్ అమెరికా (232 బిలియన్​ డాలర్లు), చైనా ఐసీబీసీ (224 బిలియన్​ డాలర్లు), అగ్రికల్చరల్ బ్యాంక్ ఆఫ్ చైనా (171 బిలియన్​ డాలర్లు), వెల్స్ ఫార్గో (163 బిలియన్​ డాలర్లు), హెచ్​ఎస్​బీసీ (160 బిలియన్ డాలర్లు) బ్యాంకుల సరసన నిలిచింది. హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్,  దాని పేరెంట్​ కంపెనీ హెచ్​డీఎఫ్​సీ లిమిటెడ్​తో విలీనం జులై 1న పూర్తయింది. 

కొత్త సంస్థ షేర్ల ట్రేడింగ్​ సోమవారమే మొదలయింది. హెచ్‌‌‌‌‌‌‌‌డీఎఫ్​సీ లిమిటెడ్  షేర్ల కేటాయింపు కోసం అర్హులైన షేర్‌‌‌‌‌‌‌‌హోల్డర్‌‌‌‌‌‌‌‌లను నిర్ణయించడానికి జులై 12 వ తేదీని రికార్డ్ డేట్‌‌‌‌‌‌‌‌గా నిర్ణయించిన విషయం తెలిసిందే. హెచ్‌‌‌‌‌‌‌‌డీఎఫ్​సీ లిమిటెడ్  అర్హత కలిగిన షేర్‌‌‌‌‌‌‌‌హోల్డర్లకు రూపాయి ముఖ విలువ కలిగిన 3,11,03,96,492 కొత్త ఈక్విటీ షేర్లను శుక్రవారం కేటాయించింది. డీల్‌‌‌‌‌‌‌‌లో భాగంగా, ప్రతి హెచ్‌‌‌‌‌‌‌‌డీఎఫ్​సీ షేర్‌‌‌‌‌‌‌‌హోల్డర్ ప్రతి 25 షేర్లకు హెచ్‌‌‌‌‌‌‌‌డీఎఫ్​సీ బ్యాంక్‌‌‌‌‌‌‌‌కు చెందిన 42 షేర్లను పొందారు.  దీని ప్రకారం, బ్యాంక్  పెయిడ్-అప్ షేర్ క్యాపిటల్ 559,17,98,806 షేర్ల నుంచి 753,75,69,464 షేర్లకు పెరిగింది. బీఎస్​ఈలో మార్కెట్ విలువ పరంగా, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్ రిలయన్స్ ఇండస్ట్రీస్ (రూ. 18.6 లక్షల కోట్లు)  టిసిఎస్ (రూ. 12.9 లక్షల కోట్లు) తర్వాత మూడవ అతిపెద్ద భారతీయ కంపెనీగా అవతరించింది. ఈ నేపథ్యంలో సోమవారం హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​ షేర్లు 2.06 శాతం లాభపడి రూ.1,678 వద్ద ముగిశాయి. 

ALSO READ:రియల్‌‌మీ నాజో 60 సిరీస్‌‌లో కొత్త ఫోన్లు

లాభం 29 శాతం జంప్

 హెచ్‌‌‌‌‌‌‌‌డీఎఫ్​సీ బ్యాంక్​ ఏకీకృత నికర లాభం ఈ ఏడాది జూన్​తో ముగిసిన మొదటి క్వార్టర్​లో 29 శాతం జంప్ చేసి రూ. 12,370 కోట్లకు చేరుకుంది. స్టాండెలోన్​ ప్రాతిపదికన నికర లాభం 30 శాతం పెరిగి రూ.11,952 కోట్లకు చేరుకుంది.  అయితే ఈ బ్యాంకుకు గత మార్చి క్వార్టర్​తో పోలిస్తే లాభాలు తగ్గాయి. ఈ క్వార్టర్​లో నికర వడ్డీ ఆదాయం (ఎన్​ఐఐ) 21 శాతం పెరిగి రూ. 23,599 కోట్లకు చేరుకుంది. అడ్వాన్సులు 15.8 శాతం పెరగడమే ఇందుకు కారణం. నికర వడ్డీ మార్జిన్  4.1 శాతానికి విస్తరించింది. ఇతర ఆదాయం రూ. 9,230 కోట్లుగా ఉంది. వీటిలో రూ. 552 కోట్ల ట్రేడింగ్ లాభాలు, గత ఏడాది కాలంలో రూ. 1,077 కోట్ల నష్టం ఉన్నాయి. బ్యాంకు నిర్వహణ ఖర్చులు 33.9 శాతం పెరిగి రూ.14,057 కోట్లకు చేరుకున్నాయి.  

కేటాయింపులు, కంటింజెన్సీలు రూ. 2,860 కోట్లుగా ఉన్నాయి. గత ఏడాది కాలంలో ఇవి రూ. 3,122 కోట్లు ఉన్నాయి. గ్రాస్​ ఎన్​పీఏలు 1.28 శాతం నుంచి1.17 శాతానికి తగ్గాయి.  ఈ ఏడాది జూన్ 30 నాటికి కరెంట్ సేవింగ్ ఖాతా డిపాజిట్ల వాటా 42 శాతంగా ఉంది. దీని మొత్తం బ్రాంచ్‌ల సంఖ్య 7,860లకు చేరింది.  లోన్​బుక్​ విలువ రూ. 16.29 లక్షల కోట్లకు చేరింది. బ్యాంక్ మొత్తం క్యాపిటల్​ అడెక్వసీ 18.9 శాతంగా ఉంది. జూన్ చివరి నాటికి   ఉద్యోగుల సంఖ్య 1,81,725కి పెరిగింది. అనుబంధ సంస్థలలో, హెచ్‌‌‌‌‌‌‌‌డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్ నికర లాభం రూ. 441 కోట్ల నుంచి రూ. 567 కోట్లకు పెరిగింది.  హెచ్‌‌‌‌‌‌‌‌డీఎఫ్​సీ సెక్యూరిటీస్ నికరలాభం రూ. 189 కోట్ల వద్ద స్థిరంగా ఉంది.