టార్గెట్‌ పూర్తి చేయని సహోద్యోగులు.. బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ తిట్లదండకం

టార్గెట్‌ పూర్తి చేయని సహోద్యోగులు.. బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ తిట్లదండకం

నిర్ధేశించిన లక్ష్యాలను చేరుకొనేందుకు ఓ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ సహోద్యోగులను బెదిరించిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రసారం కావడంతో పైస్థాయి అధికారులు అతనిపై వేటు వేశారు. అతన్ని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

కోల్‌కతాలోని హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌లో సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న పుష్పల్ రాయ్ సహోద్యోగులతో ఆన్‌లైన్ మీటింగ్ నిర్వహించారు. రోజుకు 75 ఇన్సూరెన్స్ పాలసీలు చేయాలని సహోద్యోగులకు టార్గెట్ ఇచ్చారు.  ఈ టార్గెట్ రీచ్ కాని వారిపై విరుచుకుపడ్డ  వీడియో  వైరల్ అవుతోంది. ఈ వీడియోలో రాయ్ బెంగాలీ భాషలో మాట్లాడుతున్నారు. అందులో ఒకట్రెండు సార్లు ఉద్యోగులతో "షట్ అప్" అని అరవడం మనం వినవచ్చు. అంతేకాదు.. కొందరికి హెచ్ఆర్ చేత మెమోలు కూడా జారీ చేపిస్తానంటూ బెదిరింపులకు దిగారు.

అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో హెచ్‌డిఎఫ్‌సి యాజమాన్యం నష్ట నివారణ చర్యలు చేపట్టింది. సదరు బ్యాంక్ అధికారిని సస్పెండ్ చేసింది. ఈ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్‌ అధికారిపై నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశంలో కార్మిక చట్టాలు కఠినంగా లేనందు వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని వారు ఆరోపిస్తున్నారు. 

https://twitter.com/BahlKanan/status/1665632067995029507