హెచ్‌‌‌‌డీఎఫ్‌‌‌‌సీ బ్యాంక్ లాభం రూ. 16,821 కోట్లు

హెచ్‌‌‌‌డీఎఫ్‌‌‌‌సీ బ్యాంక్ లాభం రూ. 16,821 కోట్లు

న్యూఢిల్లీ : హెచ్‌‌‌‌డీఎఫ్‌‌‌‌సీ  బ్యాంక్  స్టాండ్‌‌‌‌లోన్ లాభం ఈ ఏడాది సెప్టెంబర్​తో ముగిసిన రెండో క్వార్టర్​లో 5 శాతం పెరిగి రూ.16,821 కోట్లకు చేరుకుంది.  ఈ  ప్రైవేట్ రంగ బ్యాంకు ఏడాది క్రితం ఇదే క్వార్టర్​లో రూ.15,976 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.  సమీక్షిస్తున్న క్వార్టర్​లో మొత్తం ఆదాయం రూ. 78,406 కోట్ల నుంచి రూ. 85,500 కోట్లకు పెరిగిందని హెచ్‌‌‌‌డీఎఫ్‌‌‌‌సీ బ్యాంక్ రెగ్యులేటరీ ఫైలింగ్‌‌‌‌లో తెలిపింది.  ఈ క్వార్టర్​లో బ్యాంక్ వడ్డీ ఆదాయాన్ని రూ.74,017 కోట్లుగా నివేదించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో రూ.67,698 కోట్లు వచ్చాయి.  

నికర వడ్డీ ఆదాయం (ఎన్​ఐఐ) గత సంవత్సరం రెండో క్వార్టర్​లో రూ. 27,390 కోట్ల నుంచి రూ. 30,110 కోట్లకు మెరుగుపడింది. ఇది 10 శాతం వృద్ధిని నమోదు చేసింది. బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తులు (ఎన్​పీఏలు) స్వల్పంగా క్షీణించాయి. సెప్టెంబర్ 2024 నాటికి స్థూల రుణాలలో ఇవి 1.36 శాతానికి పెరిగాయి.   ఏడాది క్రితం 1.34 శాతం ఉన్నాయి. నికర ఎన్‌‌‌‌పీఎలు లేదా మొండి బకాయిలు గత ఆర్థిక సంవత్సరం రెండవ క్వార్టర్​ ముగింపులో 0.35 శాతం నుంచి 0.41 శాతానికి పెరిగాయి.  కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన, బ్యాంక్ నికర లాభం 6 శాతం వృద్ధితో రూ.17,826 కోట్లకు చేరుకుంది.