స్టార్ సింగర్ పై అల్లు అర్జున్ ప్రశంసలు

స్టార్ సింగర్ పై అల్లు అర్జున్ ప్రశంసలు

సింగర్ సిద్ శ్రీరామ్ పై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రశంసలు కురిపించాడు. సిద్ శ్రీరామ్ కు  మ్యూజిక్ అవసరం లేదని..అతనే ఓ మ్యూజిక్ అని ఆకాశానికెత్తేశాడు. పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్లో  జరిగినపుడు జరిగిన ఓ సంఘటన గురించి అల్లు అర్జున్ తన ఇన్ స్ట్రాగ్రమ్ లో ఈ విషయం చెప్పాడు.  ‘తాను ఖాళీగా ఉన్నప్పుడు ఈ విషయం చెప్పాలనుకున్నా.. పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మా బ్రదర్  సిద్ శ్రీరామ్ లైవ్ లో  స్టేజ్‌పై “శ్రీవల్లి” పాట పాడుతున్నప్పుడు. మ్యూజిషియన్స్  మ్యూజిక్ ప్లే చేయడం ఆపేశారు కానీ సిద్ శ్రీరామ్ పాట పాడుతూనే ఉన్నారు.  అతను  మ్యూజిక్ లేకుండా పాడి అందరినీ ఆశ్యర్యపరిచారు.  అపుడు నాకేమనిపించిందంటే.."అతనికి సంగీతం అవసరం లేదు... అతనే ఒక మ్యూజిక్ అని పొగిడాడు బన్ని.