
హైదరాబాద్, వెలుగు: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు ప్రభుత్వం కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ పదే పదే మొరాయించడం పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. తనకు ప్రాణ హాని ఉందని తెలిసినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తనకు కేటా యించిన బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ తరు చూ ఆగిపోతున్నదని, దీనికి బదులు మంచి కండిషన్‌లో ఉన్న వెహికల్ ఇవ్వాలని ఇంటెలిజెన్స్ ఐజీకి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. సోమవారం అఫ్జల్‌గంజ్ ప్రాంతంలో రాజాసింగ్ బుల్లెట్ ఫ్రూప్ కారు ఆగిపోవడంతో ఆయన మరో వాహనంలో ఇంటికి వెళ్లారు.