
ఏ వస్తువు ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటేనే అందంగా ఉంటుంది. సాధారణంగా అయితే బట్టలు అయితే బీరువాలో ఉండాలి. పండ్లు కూరగాయలు ఫ్రిజ్‌లో ఉండాలి. అదే బట్టలు ఫ్రిజ్‌లో ఉంచితే ఎలా ఉంటుంది. వినడానికి కాస్త వింతగా ఉంది కదా.. లోకోమోటివ్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న టాడ్ మోరియార్టీ అనే ఓ వ్యక్తికి డబుల్ సైడెడ్ ఫ్రిజ్ ఉంది.
అందులో ఆహార పాత్రలను ఒకవైపు, వేసుకునే బట్టలను మరోవైపు ఉంచుతాడు. అతని వద్ద 15 సంవత్సరాల నాటి స్కూల్ బట్టలు కూడా ఉన్నాయి. ఇక అతనికి ఒక హాట్ టబ్ ఉంది, అందులోనే అతను స్నానం చేసి, అందులోనే బట్టలు ఉతుకుతాడు. ఈ విధంగా తాను కరెంట్, వాటర్ రెండింటి ఖర్చు తనకు ఆదా అవుతుందని టాడ్ మోరియార్టీ తెలిపాడు.
అమెరికా వంటి ఖరీదైన ప్రదేశంలో టాడ్ మోరియార్టీ నివసిస్తునప్పటికీ, అతను ఒక సంవత్సరంలో కేవలం 3 లక్షల 70 వేల రూపాయలు మాత్రమే ఖర్చు చేస్తాడట, అయితే ఇది అతని మొత్తం జీతంలో 5 శాతం మాత్రమేనట. దీని కోసం అతను లో ప్రొఫైల్ మొయింటెన్ చేస్తాడట. దీంతో అతని స్నేహితులు అతన్ని బబుల్ బాయ్ అని కూడా పిలుస్తారట.