18 నెలల్లో 70 కిలోలు తగ్గాడు

18 నెలల్లో 70 కిలోలు తగ్గాడు

ప్రియురాలు బ్రేకప్‌ చెబితే.. దేవదాసులా మారిపోయే వాళ్లను చూస్తుంటాం. కానీ ఓ వ్యక్తి పట్టుదలతో ఫిట్ నెస్ దాసుగా మారిపోయాడు. లావుగా ఉన్నాడనే కారణంతో గర్ల్‌ఫ్రెండ్‌ అతడిని వదిలేసింది. ఈ పరిణామాన్ని అతడు షాక్ గా చూడలేదు.. ఒక చాలెంజ్ గా చూశాడు. తనను వద్దన్న గర్ల్ ఫ్రెండ్ కు దిమ్మతిరిగే సమాధానం ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. పట్టుదలతో వ్యాయామం చేసి.. ఊబకాయం నుంచి విముక్తుడయ్యాడు. కండల వీరుడిగా మారాడు. అబ్బురపరిచే ఈ సక్సెస్ స్టోరీ టిక్‌టాక్ యూజ‌ర్ ‘పువి’ది. తన వెయిట్ లాస్ జర్నీని సోషల్ మీడియాలో అతడు షేర్ చేయడంతో వైరల్ గా మారింది.  

ప్రియురాలు బ్రేకప్‌ చెప్పిన సమయంలో 139 కిలోల బరువున్న పువి.. దాదాపు18 నెలలు క్రమం తప్పకుండా ప్రతిరోజు కఠిన వ్యాయామం చేసి బరువు తగ్గాడు. ఎంతలా తగ్గాడంటే.. 70 కిలోల కొవ్వును క‌రిగించి 74 కిలోల వెయిట్ కు చేరాడు.  ట్రిపుల్‌ ఎక్స్‌ఎల్‌ సైజ్‌ నుంచి నుంచి స్మాల్‌ సైజ్‌కు మారిపోయాడు. పువి ఫోటోలు, వీడియోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. ఇవి ఎంతోమందిలో స్ఫూర్తిని నింపుతున్నాయి. పువి కృషి, పట్టుదలపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.