 
                                    మహదేవపూర్, వెలుగు: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండల పరిధిలోని బేగ్లూర్లో జాతీయ సేవా పథకం ప్రత్యేక శిబిరాన్ని గురువారం రెండో రోజు కొనసాగించారు. ఇందులో భాగంగా ఎన్ఎస్ఎస్ పీవోడీ రమేశ్ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్ నిర్వహించారు. కాళేశ్వరం పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ టి.సుష్మిత, బొమ్మపూర్ డాక్టర్ వినయ్తో కలిసి ఎన్ఎస్ఎస్ వలంటీర్లు గ్రామస్తులకు రక్తపరీక్షలు నిర్వహించారు.
బీపీ, షుగర్, ఫీవర్, ఇతర వ్యాధులకు మందులను పంపిణీ చేశారు. డాక్టర్ సుష్మిత మాట్లాడుతూ విద్యార్థుల్లో ఎక్కువ మందికి ఎనీమియా ఉన్నట్లు గుర్తించామని, సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఏఎన్ఎం, ఆశా వర్కర్లు, బేగ్లూర్ఎక్స్ సర్పంచ్ రాజయ్య, కళాశాల ఫిజిక్స్ అధ్యాపకుడు కరుణ ప్రకాష్, వైద్య సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.

 
         
                     
                     
                    