మరోసారి వివాదంలో తెలంగాణ హెల్త్ డైరెక్టర్

మరోసారి వివాదంలో  తెలంగాణ హెల్త్ డైరెక్టర్

తెలంగాణ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాస్ మరోసారి వివాదంలో ఇరుక్కున్నారు. ప్రజలందరూ  ఎంతో పవిత్రంగా పూజించే బతుకమ్మ పండగలో సినిమా పాటలకు స్టెప్పులేశారు. కొత్తగూడెం శ్రీనగర్ కాలనీ DSR క్యాంపు కార్యాలయంలో నిన్న జరిగిన ఎంగిలిపూల బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న ఆయన.. డీజే టిల్లు పాటకు డ్యాన్స్ చేశారు.  దీనిపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలను ప్రతీకైన బతుకమ్మ సంబురాల్లో.. సినిమా పాటలకు డ్యాన్సులు చేయడం ఏంటనీ ప్రశ్నిస్తున్నారు.

కరోనా సమయంలో నిరంతరం ప్రజలను అలర్ట్ చేయాల్సిన హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు.. ఇంతకుమునుపు క్షుద్రపూజలు చేస్తున్నారనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాత నగర్ మండలంలోని జిమ్నా తండాలో నిర్వహించిన పూజల్లో డీహెచ్ పాల్గొనడం వివాదాస్పదమైంది. స్వయం ప్రకటిత దేవతగా చెలామణీ అవుతోన్న సుజాత నగర్ ఎంపీపీ విజయలక్ష్మి నిర్వహించిన పూజల్లో పాల్గొన్న శ్రీనివాసరావు... అక్కడ నిర్వహించిన పూజల్లో ఎండు మిరపకాయలు హోమంలో వేస్తూ కనిపించడం కలకలం రేపింది.