
- చర్మసమస్యలొచ్చే అవకాశం చాలా ఎక్కువ
- రేడియషన్ తోపాటు ప్రీమెచ్యూర్ ఏజింగ్,పిగ్మెంటేషన్ సమస్యలొస్తాయి
- బ్లూ లైట్ నుంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే..
ఆఫీస్‌కు వెళ్తున్నా, బయటికి వెళ్తున్నా స్కిన్‌కు సంబంధించి చాలా జాగ్రత్తలు తీసుకుంటాం. రాగానే ముఖం కడుక్కోవడం లాంటివి ఎక్కువగా చేస్తాం. కానీ, ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ నడుస్తోంది. బయటికి వెళ్లడం లేదు కదా.. ఏముందిలే అని అనుకోకూడదు. ఎందుకంటే సిస్టమ్ నుంచి వచ్చే బ్లూ లైట్, రేడియేషన్ వల్ల చర్మ సమస్యలు వస్తాయి. ప్రిమెచ్యూర్ ఏజింగ్, పిగ్మెంటేషన్ లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకే, బ్లూలైట్ నుంచి స్కిన్‌ను కాపాడుకోవాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే.
సిస్టమ్ నుంచి వచ్చే బ్లూ లైట్ యూవీ కిరాణాల్లానే చర్మానికి హానికరం.
అందుకే, ఇంట్లో ఉన్నా కూడా సిస్టమ్ ముందు పనిచేసేటప్పుడు యూవీ ప్రొటక్షన్ క్రీమ్ పెట్టుకోవాలి. లేదా ఎస్‌పీఎఫ్ ఉన్న మాయిశ్చరైజర్స్ రాసుకోవాలి.
పని చేసేటప్పుడు మధ్య మధ్యలో బ్రేక్ తీసుకోవాలి. దాంతోపాటు రెగ్యులర్‌గా ఫేస్‌వాష్ చేసుకోవాలి.
బాడీ నుంచి సిస్టమ్ కనీసం 18 ఇంచుల దూరంలో ఉండాలి.
సిస్టమ్ చూసినప్పుడు కళ్లు చిన్నగా చేస్తాం. అలాంటప్పుడు ముడతలు వచ్చే అవకాశం ఉంది. అందుకు, అలాంటి ప్రాబ్లమ్ రాకుండా అండర్ ఐ జెల్ ఉపయోగించాలి.
ఆ జెల్ రాయడం వల్ల ముడతలు పడకుండా ఉండటమే కాకుండా, కళ్లల్లోంచి నీళ్లు రావు.
కంప్యూటర్ నుంచి వచ్చే వేడి వల్ల స్కిన్ డ్రై అయిపోతుంది. అలాకాకుండా ఉండాలంటే రోజుకు కనీసం రెండు లీటర్ల నీళ్లు తాగాలి.
అంతేకాకుండా యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న ఫుడ్ తినాలి. అవకాడో, టొమాటో, ఆక్రుట్ లాంటివి తీసుకుంటే స్కిన్ ఏజింగ్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి.