
జుట్టు రాలకుండా ఉండాలంటే కొబ్బరి నూనెలో కరివేపాకుని కలిపి జుట్టుకు రాసుకోవాలి. ఇలా చేస్తే హెయిర్ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడొచ్చు.
కరివేపాకులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు హెయిర్ ఫాల్‌ను కంట్రోల్ చేస్తాయి. దీనికి కొబ్బరి నూనె తోడైతే జుట్టు కుదుళ్లు గట్టిపడతాయి. దీనివల్ల జుట్టు రాలడం తగ్గుతుంది.
కొబ్బరి నూనె, కరివేపాకులో యాంటి ఫంగల్ గుణాలున్నాయి. ఇవి చుండ్రు రానీయవు.
కొబ్బరి నూనె జుట్టుకు మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. కరివేపాకు పోషణనిస్తుంది.
ఈ రెండూ కలిపి జుట్టుకు రాయడం వల్ల జుట్టు పెరుగుతుంది. ఏ కాలంలో అయినా జుట్టు హెల్దీగా కనిపిస్తుంది.
నూనె తయారీ
20–25 కరివేపాకు రెబ్బలు తీసుకుని పొడి చేయాలి. ఈ పొడిని అరకప్పు కొబ్బరి నూనెలో వేసి బాగా మరిగించాలి. ఇది చల్లారాక వడకట్టి జుట్టుకు రాయాలి. ఇది నెల రోజుల వరకూ నిల్వ ఉంటుంది. కానీ ఈ నూనె జుట్టుకు పెట్టేముందు గోరువెచ్చగా చేసి రాసుకుంటే మంచిది.
ప్రభుత్వ ఆఫీసుల తీరు మారాలి
క్రికెటర్ల జీవితాలతో ఆటలు.. హెచ్ సి ఎ చెత్త పాలనతో ప్లేయర్లకు ఇక్కట్లు
సోషల్ మీడియాలో ఆడవాళ్లపై పెరిగిన వేధింపులు
రూ.50 లక్షల లోపు ఇండ్లకు ఫుల్ డిమాండ్