డంపింగ్ యార్డులో తిండి కోసం ఏనుగుల వెతుకులాట.. ఫొటోకు టాప్ ప్రైజ్

డంపింగ్ యార్డులో తిండి కోసం ఏనుగుల వెతుకులాట.. ఫొటోకు టాప్ ప్రైజ్

న్యూఢిల్లీ: కొన్ని ఫొటోలను చూస్తుంటే రాతలు, మాటలతో చెప్పలేని విషయాలు, సందేశాలను చాలా సులువుగా చెబుతున్నారని అనిపిస్తుంది. అందుకే రాయలేని ఎన్నో భావాలను ఒక్క ఫొటోతో చెప్పడానికి ఫొటోగ్రాఫర్స్ యత్నిస్తుంటారు. ఎడిటింగ్, డిజైనింగ్ లాంటి వాటికి తావు లేకుండా సమస్యలకు అద్దం పట్టేలా తీసిన కొన్ని ఫొటోలు ప్రజల హృదయాల్ని నేరుగా తాకుతాయి. వారి కళ్లను చెమ్మగిల్లేలా చేస్తాయి. తాజాగా అలాంటి ఓ ఫొటోకు ప్రఖ్యాత రాయల్ సొసైటీ ఆఫ్ బయోలజీ కాంపిటీషన్‌‌లో టాప్ ప్రైజ్ దక్కింది. మారుతున్న ప్రస్తుత ప్రపంచం అనే థీమ్‌‌లో ప్రైజ్ దక్కించుకున్న సదరు ఫొటోలో ఏనుగులు భోజనం కోసం డంపింగ్ యార్డులో వెతుకుతుండటం అందర్నీ కంట తడి పెట్టించింది.

Stark photo of elephant herd wins Royal Society of Biology competitionA harrowing image of a herd of elephants eating…

Tharmapalan Tilaxan यांनी वर पोस्ट केले बुधवार, ७ ऑक्टोबर, २०२०

శ్రీలంకలోని ఒలువిల్ గార్బేజ్ డంపింగ్ యార్డులో ఈ ఫొటోను థర్మపాలన్ తిలక్సన్ అనే వ్యక్తి తీశారు. తెలిసిన సమాచారం ప్రకారం.. శ్రీలంక, ఈస్టర్న్ ప్రావిన్స్‌‌లోని అడవుల్లో చెత్తను విపరీతంగా పడేస్తున్నారు. రోజురోజుకీ డంప్ పెరిగిపోతున్నప్పటికీ దీన్ని ఎవ్వరూ పట్టించుకోలేదు. దీంతో ఈ గార్బేజ్ అడవిలో ఏనుగులు సంచరించే ప్రాంతం వరకు వ్యాపించింది. ఈ ఏరియాలో 25 నుంచి 30 వరకు వైట్ ఎలిఫెంట్స్ ఉంటాయని తిలక్సన్ చెప్పారు. విచారకరమైన విషయం ఏంటంటే.. ఈ డంపింగ్ యార్డుకు సమీపంలోని ఏనుగులను పరిశీలించగా వాటి పొట్టలో ప్లాస్టిక్ ప్రొడక్ట్స్, పాలిథీన్ ఉన్నట్లు గుర్తించారు. ఈ సమస్య కోసం ఎంతగా పోరాడుతున్నప్పటికీ అధికారులు పరిష్కరించడం లేదని తిలక్సన్ వాపోయారు.