మంటల్లో కాలి భర్త మృతి.. తట్టుకోలేక గుండెపోటుతో భార్య..రెండు గంటల్లో రెండు ప్రాణాలు 

మంటల్లో కాలి భర్త మృతి.. తట్టుకోలేక గుండెపోటుతో భార్య..రెండు గంటల్లో రెండు ప్రాణాలు 

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. భర్త చనిపోయిన రెండు గంటల్లోనే భార్య మృతిచెందడం  ఆ కుటుంబంలో విషాదం నింపింది. పొలం దగ్గర పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు మంటలంటుకొని భర్త మృతిచెందగా జీవిత భాగస్వామి మరణవార్త భార్య గుండెపోటుతో కుప్పకూలిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం రేపాకపల్లిలో జరిగింది. ఒకేరోజు గంటల వ్యవధిలో దంపతులిద్దరు చనిపోవడం రేపాకపల్లిలో విషాదఛాయలు అలముకొన్నాయి. 

►ALSO READ | జయశంకర్ భూపాలపల్లిలో విషాదం..పంట పొలంలో రైతు సజీవ దహనం

శనివారం (మే23) సాయంత్రం 4గంటలకు రేపాకపల్లికి చెందిన చాగర్ల చంద్రమౌళి (62) పొలం దగ్గర పనిచేస్తుండగా అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. గడ్డి కట్టలకు మంటల వ్యాపించగా మంటలార్పే క్రమంలో చంద్రమౌళికి నిప్పంటుకుంది. దీంతో చంద్రమౌళి అక్కడికక్కడే మృతిచెందాడు. భర్త మరణవార్త విన్న చంద్రమౌళి భార్య భాగ్యం(55) గుండెపోటుతో కుప్పకూలింది. హుటాహుటిన ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమాధ్యలో చనిపోయింది. భార్యభర్తలు అకస్మాత్తుగా కొన్ని గంటల వ్యవధిలోనే చనిపోవడంతో ఆకుటుంబంతోపాటు రేపాకపల్లిలో తీవ్ర విషాదంలో నెలకొంది.