2026 నాటికి 250 స్టోర్లు .. ప్రకటించిన హియర్జాప్

2026 నాటికి 250 స్టోర్లు .. ప్రకటించిన హియర్జాప్

హైదరాబాద్, వెలుగు: వినికిడి సమస్యల బాధితులకు హియరింగ్ సొల్యూషన్స్ అందించే హియర్జాప్, 2026 నాటికి 250 స్టోర్‌‌‌‌లను తెరుస్తామని, 500 మంది ఆడియోలజిస్ట్‌‌‌‌లను నియమించుకుంటామని ప్రకటించింది. తమ 100 వ స్టోర్‌‌‌‌ను హైదరాబాద్ జూబ్లీహిల్స్‌‌‌‌లో ప్రారంభించిన సందర్భంగా సంస్థ యాజమాన్యం ఈ విషయాన్ని ప్రకటించింది. 

హియర్జాప్   "100వ ఫ్లాగ్‌‌‌‌షిప్ స్టోర్"ని  సీమెన్స్  హియరింగ్ ఇన్‌‌‌‌స్ట్రుమెంట్స్ ఇన్క్ మాజీ సీఈఓ  శర్మ, హియర్జాప్  వ్యవస్థాపకుడు,  మేనేజింగ్ డైరెక్టర్ ఎస్.రాజా ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజా  మాట్లాడుతూ ,  పేషెంట్ అసెస్‌‌‌‌మెంట్‌‌‌‌ల నుంచి నెక్స్ట్-జెన్ హియరింగ్ ఎయిడ్స్ , ఆడియోలజిస్ట్‌‌‌‌ కన్సల్టేషన్ల  వరకు సమగ్రమైన సేవలను అందిస్తామని చెప్పారు.