ఎగువన కురుస్తున్న వర్షాలకు శ్రీశైలానికి జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. శుక్రవారం ( అక్టోబర్ 18) ప్రాజెక్టుకు జలకళ సంతరించుకుంది. ఒక క్రస్టు గేటు 10 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారు. ప్రాజెక్టు నిండా నీళ్లు, గేట్లు ఎత్తడంతో దిగువకు వస్తున్న నీళ్లతో ప్రాజెక్టు పరిసర ప్రాంతాలు కనుల విందు చేస్తుంది. శ్రీశైలం ప్రాజక్టు పరిసర ప్రాంతాల్లో ప్రకృతి అందాలను చూసి ఎంజాయ్ చేయాలనుకునేవారు వెళ్లొచ్చు.
శ్రీశైలం జలాశయానికి వచ్చి చేరుతున్న వరద నీటితో ఇన్ ఫ్లో పెరిగింది. ప్రస్తుతం ఇన్ ఫ్లో 93వేల 270 క్యూసెక్కులుంది. ప్రాజెక్టు పూర్తి స్థాయినీటి మట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 884.50 అడుగులకు చేరింది. ప్రాజక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 212.9198 టీఎంసీలు నీటి నిల్వ ఉంది.
Also Read:-సుప్రీంకోర్టును ఆశ్రయించిన గ్రూప్ 1 అభ్యర్థులు
శ్రీశైలం ప్రాజెక్టు కుడి, ఎడమ విద్యుత్ కేంద్రాల్లోరెండింటిలోనూ విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. గేట్ల ద్వారా ఔట్ ఫ్లో 95వేల 626 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు అధికారులు.