
మదనాపురం, వెలుగు: కొత్తకోట మండలం శంకర్ సముద్రం రిజర్వాయర్లోకి భారీగా వరద నీరు చేరడంతో ప్రాజెక్టు రెండు గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలారు. మదనాపురం మండలం దంతనూరు వద్ద ఉన్న కాజ్ వేపై వరద నీరు పారుతుండడంతో ఆదివారం తెల్లవారుజాము నుంచి శంకరమ్మపేట, దంతనూరు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.
వరద నీరంతా ఊక చెట్టు వాగు నుంచి రామన్ పాడు ప్రాజెక్టుకు చేరడంతో ఒక గేటు ఓపెన్ చేసి దిగువకు వెయ్యి క్యూసెక్కుల నీటిని కిందికి వదిలారు. పరిసర ప్రాంతాల ప్రజలు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్ జేకే మోహన్ సూచించారు.