పాలమూరులో భారీ వర్షం

పాలమూరులో భారీ వర్షం

మహబూబ్​నగర్​లో గురువారం సాయంత్రం 40 నిమిషాలపాటు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో నగరంలో న్యూటౌన్, కొత్త బస్టాండ్, వన్ టౌన్ రాయిచూర్ కు వెళ్లే ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. కొత్త బస్టాండ్ బస్సు డిపోలో వరద నీరు చేరింది. దీంతో వాహనదారులు, ప్రజలు ఇబ్బందులు పడ్డారు. -మహబూబ్ నగర్ టౌన్, వెలుగు