
-వెలుగు స్టాఫ్ ఫొటోగ్రాఫర్, మహబూబ్నగర్ : మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో వర్షం దంచి కొట్టింది. ఉదయం ఆరున్నర గంటల నుంచి ఎనిమిది గంటల వరకు దాదాపు గంటన్నర పాటు ఏకధాటిగా వర్షం పడటంతో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. మైత్రి నగర్ వద్ద నాలాలు పొంగడంతో నీరు రోడ్డుపై కి వచ్చాయి. బీకేరెడ్డి కాలనీలో పెద్ద చెరువు నాలా నుంచి బయటకు రావడంతో.. దిగువ ప్రాంతానికి చేరాయి. దీంతో స్థానికులు కొంత ఇబ్బందులు పడ్డారు.
అలాగే క్లాక్ టవర్ ప్రాంతంలో వర్షానికి రోడ్లు జలయమయ్యాయి. దీంతో వాహనాల రాకపోకలకు కొంత ఇబ్బంది ఏర్పడింది. మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి స్థానిక నాయకులతో కలిసి వర్షం కురిసిన ప్రాంతాలను పరిశీలించారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు. పాలమూరులో డ్రైనేజీ వ్యవస్థను గాడిలో పెట్టేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన చెప్పారు.