మహబూబ్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌ జిల్లాలో గాలివాన బీభత్సం

మహబూబ్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌ జిల్లాలో గాలివాన బీభత్సం

కోనరావుపేట/అచ్చంపేట, వెలుగు : రాజన్న సిరిసిల్ల, ఉమ్మడి మహబూబ్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌ జిల్లాలో శనివారం గాలివాన బీభత్సం సృష్టించింది. సిరిసిల్ల జిల్లాలోని కోనరావుపేట, బావుసాయిపేట, ధర్మారం గ్రామాల్లో పలు ఇండ్ల రేకులు ఎగిరిపోగా, చెట్లు, కరెంట్‌‌‌‌‌‌‌‌ స్తంభాలు, ట్రాన్స్‌‌‌‌‌‌‌‌ఫార్మర్లు విరిగిపడ్డాయి. కోనరావుపేటలో వైన్‌‌‌‌‌‌‌‌ షాపు రేకులు కూలడంతో నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం గడ్కోలు గ్రామానికి చెందిన  కస్తూరి సుమన్‌‌‌‌‌‌‌‌, మరో వ్యక్తికి గాయాలు అయ్యాయి.

అచ్చంపేట మండలంలో శుక్రవారం రాత్రి ఉరుములు, మెరుపులతో కూడిన బలమైన గాలులు వీయడంతో చెన్నారం గ్రామ సమీపంలోని లలిత ఉమామహేశ్వర జిన్నింగ్‌‌‌‌‌‌‌‌ మిల్‌‌‌‌‌‌‌‌ పూర్తిగా నేలమట్టమైంది. దీంతో రూ.8 కోట్ల మేర నష్టం వాటిల్లిందని బాధితులు శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌రెడ్డి, శేఖర్‌‌‌‌‌‌‌‌రెడ్డి, వెంకట్రాముడు, శాస్త్రి తెలిపారు. జిన్నింగ్‌‌‌‌‌‌‌‌ మిల్‌‌‌‌‌‌‌‌ను అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ పరిశీలించారు.

అలాగే చెన్నారం సమీపంలో 87 కరెంట్‌‌‌‌‌‌‌‌ పోల్స్‌‌‌‌‌‌‌‌ పడిపోవడంతో 8 గ్రామాలకు కరెంట్‌‌‌‌‌‌‌‌ సరఫరా నిలిచిపోయింది. అలాగే ఉప్పునుంతల మండలంలో బలమైన గాలుల కారణంగా గుడిసెలు, ఇండ్లు ధ్వంసం కాగా, చెట్లు విరిగిపోయాయి. సిద్దిపేట జిల్లాలోనూ ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి.