వరంగల్ కొత్తగూడలో పొంగిపొర్లుతున్న వాగులు

వరంగల్ కొత్తగూడలో పొంగిపొర్లుతున్న వాగులు
  • స్తంభించిన రాకపోకలు 

కొత్తగూడ, వెలుగు: మండలంలో మంగళవారం రాత్రి కురిసిన వర్షాలకు వాగులు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. మొండ్రాయి గూడెం  వాగు రోడ్డు పైనుంచి ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో రాకపోకలు స్తంభించిపోయాయి. కొత్తగా బ్రిడ్జి నిర్మిస్తుండగా సామగ్రి, డైవర్షన్ రోడ్డు వరద ఉధృతికి కొట్టుకుపోయాయి.

తహసీల్దార్ రాజు బుధవారం వాగును పరిశీలించారు. ప్రభుత్వానికి నివేదిక పంపిస్తున్నట్లు తెలిపారు. ఎదుళ్లపల్లి హైస్కూల్ ప్రహరీ కూలిపోయింది. కొత్తపల్లి–పొగుళ్లపల్లి దారిలో క్రాస్ రోడ్డు వద్ద  కొత్తగా నిర్మించిన కల్వర్టుపై పోసిన మొరం వర్షానికి బురదమయమైంది. ఈ రోడ్డులో ఆర్టీసీ బస్సులు బంద్​ అయ్యాయి. ఆటోలు, టూవీలర్లు మాత్రమే నడుస్తున్నాయి.