జిల్లాల్లో దంచికొడుతున్న వానలు

జిల్లాల్లో దంచికొడుతున్న వానలు

జిల్లాల్లో వానలు దంచికొడుతున్నాయి. వాయువ్య, పశ్చిమ బంగాళాఖాతం, ఉత్తర ఒరిస్సా ప్రాంతాల్లో అల్పపీడనం కేంద్రీకృతమైంది. దీనికి అనుబంధంగా ఉపరితల అవర్తనం ఏర్పడింది. వీటి ప్రభావంతో మన రాష్ట్రంలో రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు.

శనివారం రాత్రి నుంచే పలు జిల్లాల్లో వానలు పడుతున్నాయి. నల్గొండ జిల్లా కనగల్‌లో 9.7 సెంటీమీటర్లు, నారాయణ పేట జిల్లా దామరగిద్దలో 7.4సెంటీమీటర్లు, ధన్వాడలో 7.3సెంటీమీటర్లు, సూర్యాపేట జిల్లా గరిడేపల్లిలో 6.7 సెంటీమీటర్లు, సంగారెడ్డి జిల్లా కంగ్టిలో 6.6 సెంటీమీటర్లు, నారాయణ పేట్ జిల్లా చిన్న జట్రాంలో 6.4సెంటీమీటర్లు వర్షపాతం నమోదైంది.

రాష్ట్రంలో ఇవాళ, రేపు భారీవర్షాలు పడే అవకాశాలున్నాయి. రాష్ట్రమంతటా ఈదురుగాలులతో విస్తారంగా వానలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో భారీ నుంచి.. అతిభారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది.