
ఉత్తరప్రదేశ్ ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ప్రయాగ్ రాజ్ లో కొన్ని రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. గంగా, యమునా నదులు పొంగి ప్రవహిస్తున్నాయి.దీంతో పరివాహక ప్రాంతాలు నీట మునిగాయి . గ్రామాల్లోకి భారీగా నీరు చేరడంతో.. ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. రహదారులు మోకాల లోతు నీటితో మునిగిపోయాయి.రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు స్థానికులు . పడవల సహాయంతో రోడ్లు దాటుతున్నారు.