
బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుండటంతో తెలంగాణ వ్యాప్తంగా కుండపోతగా వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది.శుక్రవారం నుంచి వర్షాలు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ క్రమంలో హైదరాబాద్ తో పాటుగా 15 జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ అధికారులు.
ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.
కాబట్టి ఈ 16జిల్లాల్లో ముంపు ప్రాంతాల ప్రజలు కాస్త జాగ్రత్తగా ఉండాలని సూచించింది. భారీ వర్షాల హెచ్చరికల నేపధ్యంలో జిల్లా అధికారులు సైతం అప్రమత్తమయ్యారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చెప్పారు. ఇక హైదరాబాద్ లో భారీ వర్షం కురిసే అవకాశం ఉండటంతో ఎల్లో అలెర్ట్ జారీ చేశారు.