తిరుపతిలో భారీ వర్షం: నీట మునిగి నవ వధువు మృతి

V6 Velugu Posted on Oct 23, 2021

తిరుపతి: ఏపీ తిరుపతిలో ఘోరం జరిగింది. భారీ వర్షానికి నీటిలో మునిగి నవ వధువు చనిపోయింది. మృతురాలి కుటుంబ సభ్యులు కర్ణాటక రాయచూరు నుంచి తిరుమల శ్రీవారి దర్శనానికి వస్తుండగా భారీ వర్షం కురిసింది. తిరుపతి వెస్ట్ చర్చి అండర్ బ్రిడ్జి లోకి భారీగా వరద నీరు చేరింది. దీంతో ఏడుగురితో ప్రయాణిస్తున్న తుఫాన్ వాహనం వరద నీటిలో చిక్కుకుంది. వాహనంలోని నవ వధువు సంధ్య వరద నీటిలో చిక్కుకొని చనిపోయింది. మరో చిన్నారి అస్వస్థత గురైంది. వరద నీటిలో వాహనం చిక్కుకున్న విషయాన్ని గమనించి ఎస్వీ యూనివర్సిటీ పోలీసులు మిగతా వారిని సేఫ్ గా బయటకు తీసుకొచ్చారు. 

Tagged death, Tirupati, Heavy rains, New Bride,

Latest Videos

Subscribe Now

More News