
నిర్మల్: భారీవర్షాలు, వరదలకు నిర్మల్ జిల్లా ఆగమాగం అయింది. నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నిర్మల్ జిల్లా వ్యాప్తంగా భారీ వరదలు సంభవించాయి. దీంతో జిల్లాలో పలు ప్రాంతాల్లో పంటలు నీటిమునిగాయి. పలు గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. కొన్ని చోట్ల గ్రామాలకు గ్రామాలు జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి. గ్రామాల్లో వీధులు చెరువులను తలపించాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రాబోయే రెండు రోజులు కూడా వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. పలు అప్రమత్తంగా ఉండాలని కోరింది.
గురువారం (ఆగస్టు 28) కురిసిన భారీ వర్షాలకు నిర్మల్ జిల్లాలోని ముధోల్ గ్రామం పూర్తిగా నీటమునిగింది. గ్రామంలో ఎక్కడ చూసిన నీళ్లే కనిపించాయి. గ్రామంలోని రోడ్లన్నీ చెరువులను తలపించాయి. ముధోల్ గ్రామంలోని మహాత్మా జ్యోతిబాపూలే బాలికల పాఠశాల, హాస్టల్ తోపాటు మహాలక్ష్మీ ఆలయం కూడా పూర్తిగా నీట మునిగింది. దీంతో విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు హాస్టల్ సిబ్బంది. ముధోల్ లోని బస్టాండ్ నుంచి గ్రామంలో వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా జలమయమయ్యింది. సాయి మాధవ నాగర్ లో ని లోతట్టు ప్రాంతాలన్నీ వరదనీటిలో చిక్కుకున్నాయి.
►ALSO READ | గోదావరి జలాలకు ఎల్లంపల్లి ప్రాజెక్టే ప్రాణవాయువు.. కాళేశ్వరం దగ్గర నీళ్లు ఆపితే గ్రామాలు కొట్టుకుపోతాయి