తిరుమలకు పోటెత్తిన భక్తులు

 తిరుమలకు పోటెత్తిన భక్తులు
  • వీకెండ్, పెళ్లిళ్ల సీజన్ కావడంతో అనూహ్యంగా పెరిగిన రద్దీ
  • శ్రీవారి దర్శనానికి 20గంటలకు పైగా సమయం

తిరుపతి: వారాంతపు సెలవులు, పెళ్లిళ్ల సీజన్ కావడంతో తిరుమల కొండ భక్తులతో కిటకిటలాడుతోంది. కొండపై భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు భారీగా బారులు తీరారు.  వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్టుమెంట్లు నిండిపోయి, బయట క్యూ లైన్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి సుమారు 20 గంటల సమయం పడుతోంది. 
దర్శనానికి ఎక్కువ సమయం పడుతుండడంతో గదులు తీసుకున్న భక్తులు ఖాళీ చేయడం లేదు.

దీంతో వసతి గదులు దొరక్క భక్తులు తీవ్రంగా ఇబ్బందులకు గురవుతున్నారు. శుక్రవారం 64,438 మంది భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామి వారి హుండీ ఆదాయం  రూ. 4.53 కోట్లు వచ్చింది. ఇక 34,361 మంది స్వామి వారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.