కేసులకు నాకు ఎలాంటి సంబంధం లేదు.. నా ప్రతిష్ట చెడగొట్టేందుకే ఈడీ అరెస్ట్: హేమంత్ సోరేన్

కేసులకు నాకు ఎలాంటి సంబంధం లేదు.. నా ప్రతిష్ట చెడగొట్టేందుకే ఈడీ అరెస్ట్: హేమంత్ సోరేన్

జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరేన్ తన అరెస్ట్పై స్పందించారు. నేను అరెస్టులకు భయపడను.. నేను శిబూ సోరేన్ కుమారుడిని.. అరెస్ట్ పై ఏమాత్రం చిత్రించను.. నన్ను కావాలనే నాకు సంబంధం లేని కేసులలో అరెస్ట్ చేశారు.

 

ఈడీ అధికారులకు ఎలాంటి ఆధారాలు దొరకలేదు.ఢిల్లీలోని నా నివాసం దాడులు చేసి నా ప్రతిష్ఠను చెడగొట్టేందుకు ప్రయత్నించారు. పేదలు, ఆదివాసీలపై అఘాయిత్యాలకు పాల్పడే వారిపై దళితులు, ఆదివాసీలు పోరాటం చేయాల్సి ఉంది అని  బుధవారం(జనవరి 31) సాయంత్రం అరెస్ట్ కు ముందు  హేమంత్ సోరేన్ చెప్పారు.

నిన్న జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ ను అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు ఇవాళ ప్రత్యేక PMLA కోర్టులో హాజరుపర్చారు. హేమంత్ సోరేన్ కు  ఒక రోజు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. మనీలాండరింగ్ కేసులో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న హేమంత్ సోరేన్ ను నిన్న ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ కు ముందు ఆయన తన సీఎం పదవికి రాజీనామా చేశారు.