వీడిన తిరుపతి మర్డర్ మిస్టరీ.. భర్తే కాల్చి చంపాడు

వీడిన తిరుపతి మర్డర్ మిస్టరీ.. భర్తే కాల్చి చంపాడు

తిరుపతిలో కలకలం రేపిన సూట్ కేస్ హత్య మిస్టరీ వీడింది. హైదరాబాద్ టీసీఎస్ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఉద్యోగిని భువనేశ్వరి మృతదేహంగా పోలీసులు గుర్తించారు. భర్త శ్రీకాంత్ రెడ్డి హత్యచేసి సూట్ కేస్ లో తీసుకెళ్లి పెట్రోల్ పోసి తగలబెట్టినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. శ్రీకాంత్ రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు పోలీసులు. 

కడప జిల్లాకు చెందిన శ్రీకాంత్ రెడ్డికి.. చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజవర్గం రామసముద్రం గ్రామానికి చెందిన భువనేశ్వరితో ఐదేళ్ల క్రితం వివాహమైంది. భువనేశ్వరి హైదరాబాద్ లోని టీసీఎస్ కంపెనీలో సాఫ్టువేర్ జాబ్ చేసేది. వీళ్లు తిరుపతిలోని కొర్లగుంటలో నివాసం ఉండేవారు. లాక్ డౌన్ కావటంతో తిరుపతిలోనే వున్నారు. మొదటి నుంచి భువనేశ్వరిపై అనుమానం పెంచుకున్న శ్రీకాంత్ రెడ్డి.. అతి కిరాతకంగా చంపి సూట్ కేసులో తీసుకువచ్చి.. తిరుపతి రుయా ఆస్పత్రి వెనుక కాల్చేశాడు. ఈ ఘటన 22న జరగగా.. పోలీసుల దర్యాప్తులో భర్తే హత్య చేశాడని తేలింది.