
హైదరాబాద్, వెలుగు: డెయిరీ కంపెనీ హెరిటేజ్ఫుడ్తన ప్రొడక్టుల ప్రచారం కోసం ‘గెలుపు కంటే నేర్చుకోవడం ముఖ్యం’ పేరుతో బ్రాండ్ క్యాంపెయిన్ ప్రారంభించింది. మదర్స్ డే సందర్భంగా దీనిని విడుదల చేసింది. పాలు చిన్నారుల ఎదుగుదలకు ఎంత ముఖ్యమో ఇది వివరిస్తుంది. వారి మేధస్సు, భావోద్వేగ అభివృద్ధికి పాలు కీలకమని కంపెనీ ఎగ్జిక్యూటివ్డైరెక్టర్ నారా బ్రాహ్మణి ఈ సందర్భంగా అన్నారు.