యువ హీరో అల్లు శిరీష్ వివాహ నిశ్చితార్థం నయనికతో వైభవంగా జరిగింది. శుక్రవారం (అక్టోబర్ 31న) హైదరాబాద్ జూబ్లిహిల్స్‌లో జరిగిన ఈ వేడుకకు చిరంజీవి, అల్లు అరవింద్ కుటుంబ సభ్యులు, సన్నిహితులు హాజరై కొత్తజంటను ఆశీర్వదించారు.
ఉంగరాలు మార్చుకుని కొత్త జీవితానికి తొలి అడుగులు వేసిన ఈ జంట.. త్వరలోనే పెళ్లి పీటలెక్కనుంది. రామ్ చరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, సాయి దుర్గ తేజ్, వైష్ణవ్ తేజ్ సహా మెగా ఫ్యామిలీ హీరోలందరూ ఎంగేజ్‌మెంట్‌లో సందడి చేశారు. దీంతో ఈ నిశ్చితార్థ వేడుకకు చెందిన ఫొటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ తరుణంలోనే శిరీష్ తన లవ్‌స్టోరీ జర్నీని రివీల్ చేశాడు. హీరో నితిన్ సతీమణి షాలిని బెస్ట్ ఫ్రెండే.. తనకు కాబోయే భార్య (నయనిక) అని ఫోటో షేర్ చేసి పంచుకున్నారు.
‘‘వరుణ్ తేజ్-లావణ్యల మ్యారేజ్ టైంలో (2023 అక్టోబరు).. హీరో నితిన్, షాలిని దంపతులు వారికి ఓ పార్టీ ఇచ్చారు. ఆ సెలబ్రేషన్స్‌కు షాలిని బెస్ట్‌ఫ్రెండ్ నయనిక కూడా అటెండ్ అయ్యింది. అలా ఫస్ట్ టైం నయనికను చూశా. అలా ప్రేమించుకున్నాం. ఇపుడు రెండేళ్ల తర్వాత సంతోషంగా నిశ్చితార్థం చేసుకున్నాం. ఏదో ఒక రోజు, మా మధ్య పరిచయం ఎలా మొదలైందంటూ.. నా పిల్లలు నన్ను అడిగినప్పుడు, నేను వారికి ఇదే చెబుతా. నన్ను తమ సర్కిల్‌లో చేర్చుకున్న నయనిక ఫ్రెండ్స్ అందరికీ థాంక్స్’’ అని శిరీష్ ట్వీట్ చేశారు.
►ALSO READ | Thalavara OTT : కళ్లు తెరిపించే మలయాళ మూవీ.. హీరోకి బొల్లి వ్యాధి.. ఆత్మ విశ్వాసానికి కుదోస్ అనాల్సిందే!
A party at home with family & friends celebrating Varun & Lavanya’s upcoming wedding! pic.twitter.com/QiQlrCw8uH
— Allu Sirish (@AlluSirish) October 16, 2023
