Kishor B: మరో తెలుగు దర్శకుడితో ధనుష్ సినిమా.. ఇది నిజంగా గోల్డెన్ ఆఫర్!

Kishor B: మరో తెలుగు దర్శకుడితో ధనుష్ సినిమా.. ఇది నిజంగా గోల్డెన్ ఆఫర్!

తమిళ స్టార్ ధనుష్(Danush) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మిగతా స్టార్స్ కి చాలా భిన్నంగా ఉంటాయి ఆయన సినిమాలు. స్టార్ డమ్, కమర్షియల్ సినిమాలకు చాలా దూరంగా ఉంటారు ఆయన. అందుకే భాషతో సంబంధం లేకుండా ఆయన సినిమాలను ఇష్టపడతారు ఆడియన్. అంతేకాదు.. కథ బాగుంటే ఎలాంటి పాత్ర చేయడానికైనా సిద్ధంగా ఉంటాడు. దానికి చాలా ఎగ్జామ్పుల్స్ ఉన్నాయి. దర్శకులను కూడా అలాగే సెలెక్ట్ చేసుకంటారు ఆయన. 

ఇప్పటికే.. టాలీవుడ్ సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల(Shekar Kammula)తో సినిమా చేస్తున్న ధనుష్.. ఇప్పుడు మరోసారి తెలుగు దర్శకుడికి ఛాన్స్ ఇస్తున్నారట. అవును.. తెలుగులో శ్రీకారం సినిమా చేసిన కిషోర్ బి(Kishore B) ధనుష్ కోసం అద్భుతమైన కథని సిద్ధం చేశాడట. శ్రీకారం సినిమాలగే సెన్సిబుల్ గా ఉండే ఈ కథను ధనుష్ కు వినిపించగా ఆయన కూడా వెంటనే ఒకే చెప్పారని తెలుస్తోంది. టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు సంస్థలో తెరకెక్కనున్న ఈ సినిమా అధికారిక ప్రకటన త్వరలోనే రానుందని టాక్. ప్రస్తుతం ఈ న్యూస్ ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.  

also read : నాని లైనప్ చూస్తే మతిపోవాల్సిందే..సాలిడ్ హిట్స్ కన్ఫమ్!

ఇక ధనుష్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన కుబేర సినిమా చేస్తున్నారు.   పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అక్కినేని నాగార్జున కూడా కీ రోల్ చేస్తున్నారు. ఇటీవల ఈ సినిమా నుండి విడుదలైన ధనుష్ ఫస్ట్ లుక్ చూసి ఆడియన్స్ అవాక్కయ్యారు. బిచ్చగాడి గెటప్ లో ఉన్న ఆయన లుక్ చాలా వైరల్ అయ్యింది. ఒక పాత్ర నచ్చితే ఈయన ఎంత దూరమైనా వెళ్తారు అనడానికి ఈ పాత్రనే ఉదాహరణ. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా.. ఈ ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమా.