
హీరో ఎలక్ట్రిక్ తన హెచ్‌ఎక్స్ సిరీస్‌లో భాగంగా ఎన్‌వైఎక్స్ మోడల్స్ ఎలక్ట్రిక్ స్కూటర్లను లాంచ్ చేసింది. కొన్ని మోడల్స్..ఒక్కసారి చార్జ్ చేస్తే 210 కిలోమీటర్లు వెళ్తాయి. కొన్ని మోడల్స్ 82 కిలోమీటర్ల మైలేజీ ఇస్తాయి. వీటిలోని పవర్ ట్రెయిన్ వల్ల బ్యాటరీపై ఒత్తిడి ఎక్కువ ఉండదని పేర్కొంది. కాంబీ బ్రేకులు, రీజనరేటివ్ బ్రేకింగ్, మాడ్యులర్ బ్యాటరీ, బ్లూటూత్, స్మార్ట్ కనెక్టివిటీ సొల్యూషన్స్ వంటివి ఈ బైక్స్ ప్రత్యేకతలు. ధరలు రూ.64,640 నుంచి మొదలవుతాయి.