
యంగ్ హీరో కార్తికేయ గుమ్మికొండ(Karthikeya Gummikonda) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ బెదురులంక 2012(Bedurulanka 2012). కొత్త దర్శకుడు క్లాక్స్(Clax) తెరకెక్కిస్తున్న ఈ మూవీలో డీజీ టిల్లు(DJ Tillu) బ్యూటీ నేహా శెట్టి(Neha shetty) హీరోయిన్ గా నటిస్తోంది. టీజర్. ట్రైలర్స్ తో మంచి అంచనాలు క్రియేట్ చేసిన ఈ మూవీ ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ప్రమోషన్స్ పనులు మొదలు పెట్టేశారు యూనిట్. తాజాగా హీరో కార్తికేయ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందిలో భాగంగా ఆయన బెదురులంక సినిమా గురించి, తన మొదటి సినిమా ఆర్ఎక్స్ 100(RX 100) గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు.
ఇంటర్వ్యూలో భాగంగా యాంకర్ మీ మొదటి సినిమా ఆర్ఎక్స్ 100కు సీక్వెల్ ఉంటుందని గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి అది నిజమేనా? నిజంగా ఆర్ఎక్స్ 100 సినిమాకు సీక్వెల్ ఉంటుందా అని ప్రశ్నించారు. దానికి సమాధానంగా కార్తికేయ మాట్లాడుతూ.. ఆర్ఎక్స్ 100 సినిమా సీక్వెల్ గురించి నాకు తెలియదు. ఆ టాపిక్ గురించి కూడా నేను అజయ్ భూపతి(Ajay bhupathi) మాట్లాడుకోలేదు. కానీ అజయ్ భూపతితో త్వరలోనే మరో సినిమా చేస్తాను. అది ఆర్ఎక్స్ 100 సీక్వెల్ మాత్రం కాదు. మరోసారి కొత్త కాన్సెప్ట్ తో వస్తాం అని చెప్పుకొచ్చారు కార్తికేయ. ఇక కార్తికేయ ఇచ్చిన క్లారిటీతో ఆర్ఎక్స్ 100 సీక్వెల్ పై వస్తున్న రూమర్స్ కు చెక్ పడింది.
ఇక ఆర్‌ఎక్స్100 సినిమా విషయానికి వస్తే.. అజయ్ భూపతి, కార్తికేయ గుమ్మికొండ, పాయల్ రాజ్పుత్(Payal rajputh) కాంబోలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని అందుకుంది. అవుట్ అండ్ అవుట్ యూత్ఫుల్ అండ్ ఎమోషనల్ కాన్సెప్ట్ వచ్చిన ఈ సినిమాకి ఆడియన్స్ ఫిదా అయిపోయారు. మరీ ముఖ్యంగా యూత్ ఈ సినిమాను చూసేందుకు ఎగబడ్డారు. దీంతో ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.