దీపావళి బరిలో హీరో కిరణ్ అబ్బవరం.. పీరియాడిక్ థ్రిల్లర్గా తొలి పాన్ ఇండియా మూవీ

దీపావళి బరిలో హీరో కిరణ్ అబ్బవరం.. పీరియాడిక్ థ్రిల్లర్గా తొలి పాన్ ఇండియా మూవీ

కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) హీరోగా నటించిన పీరియాడిక్ సినిమా ‘క’(KA).  నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్స్. సుజీత్, సందీప్ దర్శకత్వంలో చింతా గోపాలకృష్ణ రెడ్డి నిర్మించారు. దీపావళి కానుకగా అక్టోబర్ 31న  తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడలో విడుదలవుతోంది.

ఈ సందర్భంగా హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో నిర్వహించిన ప్రెస్‌‌‌‌‌‌‌‌మీట్‌‌‌‌‌‌‌‌లో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ.. ‘దీపావళికి థియేటర్స్ దగ్గర  మంచి పోటీ ఉంది. అయినా  కంటెంట్‌‌‌‌‌‌‌‌పై నమ్మకంతో  వంశీ నందిపాటి రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే టీజర్, సాంగ్స్‌‌‌‌‌‌‌‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. సెవెంటీస్ బ్యాక్‌‌‌‌‌‌‌‌డ్రాప్‌‌‌‌‌‌‌‌లో సాగే పీరియాడిక్ స్టోరీ ఇది. యూత్‌‌‌‌‌‌‌‌తో పాటు కుటుంబ ప్రేక్షకులను కూడా ఆకర్షించే అంశాలుంటాయి’ అని చెప్పాడు.

ఇందులో నటించడం హ్యాపీ అంది తన్వీ రామ్. యూనిక్ పాయింట్‌‌‌‌‌‌‌‌తో రూపొందిన ఈ చిత్రం ఆడియెన్స్‌‌‌‌‌‌‌‌కు కొత్త ఎక్స్‌‌‌‌‌‌‌‌పీరియెన్స్‌‌‌‌‌‌‌‌ను ఇస్తుందని దర్శక నిర్మాతలు అన్నారు. తెలుగులో ఈ చిత్రాన్ని విడుదల చేయడం పట్ల వంశీ నందిపాటి సంతోషం వ్యక్తం చేశారు.