
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం(Kiran abbavaram) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ రూల్స్ రంజన్(Rules ranjan). డీజే టిల్లు(Dj Tillu) ఫేమ్ నేహా శెట్టి(Neha shetty) హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు రత్నం కృష్ణ(Rathinam krishna) దర్శకత్వం వహిస్తున్నారు. అవుట్ అండ్ అవుట్ కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ప్రమోషన్స్ పనుల్లో వేగం పెంచారు మేకర్స్.
#AskKiranAbbavaram #RulesRanjann https://t.co/Pvxflik5oe pic.twitter.com/edZXIvyeoV
— Kiran Abbavaram (@Kiran_Abbavaram) October 3, 2023
Also Read :- కొత్త ఫ్రెండ్ను పరిచయం చేసిన రామ్ చరణ్
ఇందులో భాగంగా తాజాగా ఎక్స్(ట్విటర్)లో ఫ్యాన్స్ తో ముచ్చటించారు హీరో కిరణ్ అబ్బవరం. అందులో కొందరు సరదా ప్రశ్నలు అడిగితే.. కొందరేమో కిరణ్ పై సెటైర్లు వేశారు. వాటన్నిటికీ ఓపికగా సమాధానాలు, కౌంటర్లు ఇచ్చాడు ఈ యంగ్ హీరో. ఈ క్రమంలోనే ఓ నెటిజన్.. రూల్స్ రంజన్ మూవీ హిట్ అయ్యాక నీకు రతిక రోజ్ లాంటి అమ్మాయితో పెళ్లవ్వాలని కోరుకుంటున్నాను.. ఆల్ ద బెస్ట్ అని కామెంట్ చేశారు. దీనికి కిరణ్ స్పందిస్తూ.. ఎందుకమ్మా నామీద నీకంత పగ.. పెళ్లయితే చేసుకుందాం కానీ.. చూద్దాం ఎలాంటి అమ్మాయి వస్తుందో.. అంటూ రిప్లై ఇచ్చాడు. ఇక మరో నెటిజన్.. హీరోలా ఉన్నావ్ అన్నా.. అని కామెంట్ చేయగా.. హీరోలా లేకపోయినా పర్లేదు, మీలో ఒకడిలా ఉంటే చాలు.. అని కౌంటర్ ఇచ్చాడు కిరణ్. ప్రస్తుతం దీనికి సంబందించిన వీడియోను సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
#Askkiranabbavaram #RulesRanjann https://t.co/JfFvmxmPrR pic.twitter.com/AOiaLfM8pJ
— Kiran Abbavaram (@Kiran_Abbavaram) October 3, 2023