హీరో’ లాభం రూ.1,257 కోట్లు

హీరో’ లాభం రూ.1,257 కోట్లు

ముంబై: ప్రముఖ టూవీలర్‌ కంపెనీ హీరో మోటోకార్ప్‌ ఈ ఏడాది జూన్‌తో ముగిసిన మొదటి క్వార్టర్‌లో రూ.1,257 కోట్ల లాభం సంపాదించింది. నేషనల్‌ కాలమిటీ కంటెజెన్సీ డ్యూటీ రద్దుతో రూ.737 కోట్లు వచ్చింది. గతేడాది జూన్‌ క్వార్టర్‌లో పన్నుకు ముందు లాభం  రూ.909 కోట్లు కాగా,
తాజా క్వార్టర్‌లో ఇది రూ.1,257 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం రూ.8,809 కోట్ల నుంచి రూ.8,030 కోట్లకు పడిపోయింది. కన్సాలిడేటెడ్‌గా చూస్తే ఇది రూ.8,913 కోట్ల నుంచి రూ.8,185 కోట్లకు తగ్గింది. రుతుపవనాల ప్రగతి, పండగల సీజన్‌ అమ్మకాలు, లిక్విడిటీ అందుబాటును బట్టి ఇక నుంచి అమ్మకాల్లో మార్పులు ఉంటాయని కంపెనీ తెలిపింది.