నన్ను నేను ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి

నన్ను నేను ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి

థ్యాంక్యూ మూవీ నన్ను డిస్సపాయింట్ చేసిందని టాలీవుడ్ యంగ్ హీరో నాగ చైతన్య అన్నారు. నాగ చైతన్య బాలీవుడ్ మూవీ లాల్ సింగ్ చడ్డాలో నటించారు. ఈ మూవీ ఆగస్టు 11న ప్రపంచ వ్యాప్తంగా అత్యంత భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు. ఈ సందర్బంగా హీరో అక్కినేని నాగ చైతన్య మీడియాతో మాట్లాడుతూ.. "థ్యాంక్యూ సినిమా నున్న చాలా నిరుత్సాహపరిచింది. లైఫ్ లో ఫేల్యూర్, సక్సెస్ ఒక భాగం మాత్రమే. నన్ను నేను ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి. అందుకోసం నేను నిరంతరం కృషి చేస్తున్నాను. నాకు సౌత్, నార్త్ అనే తేడా ఏమి లేదు. ఇండియన్ సినిమాకి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు లభిస్తోంది. అయితే తెలుగు, తమిళ్ సినిమా నా హార్ట్. ఆ తర్వాతే ఏదైనా అన్నారు.

ఇక లాల్ సింగ్ చడ్డా సినిమా నా క్యారెక్టర్ పేరు బాలరాజు. కావాలని తెలుగు నేటివిటి కోసం డిజైన్ చేసిన క్యారెక్టర్ ఇది. తెలుగు ఆడియన్స్ కనెక్ట్ అయ్యే రోల్. కార్గిల్, జుమ్ము కాశ్మీర్ తో పాటు గోదావరి జిల్లాల్లో షూటింగ్ చేశాము. నా క్యారెక్టర్ కోసం బాలరాజు, బాలక్రిష్ణ, బలరాం... ఇలా చాలా పేర్లు అనుకున్నారు. కానీ అమిర్ కి బాల్ రాజు పేరు నచ్చింది. ఈ సినిమాని చిరంజీవి ప్రజెంట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. పర్సనల్ గా ఇంట్రస్ట్ తీసుకుని మరీ ప్రమోషన్ చేశారు. ముంబై, డిల్లీ లలో ప్రత్యేక షోలు వేశాం. పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది" అని తెలపారు.