Balakrishna: తమ్ముడు పవన్ ‘ఓజీ’ కోసం వెనక్కి తగ్గా!.. అఖండ-2 విడుదలపై బాలయ్య క్లారిటీ

Balakrishna: తమ్ముడు పవన్ ‘ఓజీ’ కోసం వెనక్కి తగ్గా!.. అఖండ-2 విడుదలపై బాలయ్య క్లారిటీ

హిందూపురం ఎమ్మెల్యే, హీరో నందమూరి బాలకృష్ణ (సెప్టెంబర్ 23న) అసెంబ్లీ లాబీలో చిట్‌చాట్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా బాలకృష్ణతో మంత్రులు, ఎమ్మెల్యేలు సరదా ప్రశ్నలు వేసి ఆకట్టుకున్నారు. ఇందులో భాగంగా అఖండ-2 రిలీజ్ ఎప్పుడంటూ బాలయ్యను అడిగారు మంత్రులు, ఎమ్మెల్యేలు. ఈ ప్రశ్నకు బదులుగా బాలయ్య స్పందిస్తూ.. ‘ఎల్లుండి (సెప్టెంబర్ 25న) తమ్ముడు పవన్‌ కళ్యాణ్ ఓజీ సినిమా’ విడుదలవుతోందని చెప్పారు.

ఆ తర్వాత అఖండ-2 డిసెంబర్‌ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ పాన్‌ ఇండియా వైడ్గా వివిధ భాషల్లో భారీ స్థాయిలో తీసుకొస్తున్నామని చెప్పారు. ఈ క్రమంలో హిందీ డబ్బింగ్‌ సైతం బాగా వచ్చిందని బోయపాటి తనతో చెప్పినట్లు బాలకృష్ణ గుర్తుచేశారు.

అతి త్వరలోనే అన్ని భాషల్లోనూ ప్రమోషన్‌ కార్యక్రమాలు షురూ అవ్వనున్నట్లు చిట్‌చాట్‌ ద్వారా అఖండ 2 విశేషాలు పంచుకున్నారు బాలయ్య. అలాగే, తన సహచర ఎమ్మెల్యేలు, మంత్రులు కలిసికట్టుగా నియోజకవర్గాల అభివృద్ధికి కృషిచేద్దామని పిలుపునిచ్చారు బాలకృష్ణ.

అఖండ 2 గురించి:

బాలకృష్ణ , బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న మూవీ 'అఖండ 2: తాండవం'. 'సింహా', 'లెజెండ్', 'అఖండ' వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాల తర్వాత వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.సెప్టెంబర్ 25న ఓజీతో బరిలో ఉండాల్సిన ఈ మూవీ ఊహించని పరిణామాలతో వాయిదా పడింది. ఈ వార్త  అభిమానులను  తీవ్ర నిరాశకు గురిచేసింది. అయితే, ఇదే 'అఖండ 2' కు కలిసొచ్చే అంశంగా నిలిచిందని చిత్ర బృందం అభిప్రాయపడుతోంది. 

►ALSO READ | దుల్కర్ సల్మాన్, పృథ్వీరాజ్‌ల ఇళ్లపై కస్టమ్స్ మెరుపుదాడులు.. లగ్జరీ కార్ల స్మగ్లింగ్ కేసులో కీలక మలుపు!

ఇకపోతే.. 'అఖండ 2: తాండవం'లో బాలకృష్ణ పోషించే అఘోరా పాత్ర మరోసారి ప్రేక్షకులను ఉర్రూతలూగించడం ఖాయమని చెబుతున్నారు. ఈసారి సినిమా మరింత భారీ స్థాయిలో, హిమాలయాల నేపథ్యంలో యాక్షన్ సన్నివేశాలతో తెరకెక్కుతోంది. విలన్‌గా ఆది పినిశెట్టి నటిస్తుండగా, హీరోయిన్గా సంయుక్త మీనన్ నటిస్తోంది. వీరితో పాటు ప్రగ్యా జైస్వాల్, హర్షాలీ మల్హోత్రా కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీకి సి. రామ్‌ప్రసాద్, సంతోశ్‌ డిటాకే ఛాయాగ్రాహకులుగా వ్యవహరిస్తున్నారు.