ఎట్లయితే గట్లే.. చూసుకుందాం.. దసరా ట్రైలర్ రివ్యూ

ఎట్లయితే గట్లే.. చూసుకుందాం.. దసరా ట్రైలర్ రివ్యూ

ధరణిగా పెట్టి పుట్టావ్ రా.. నా కొడకా.. ఈ డైలాగ్ నుంచి.. ఎట్లయితే గట్టే.. చూసుకుందాం వరకు దసరా ట్రైలర్ అద్దిరిపోయింది.. హీరో నానీ రా అండ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన దసరా మూవీ ట్రైలర్ మార్చి 14న రిలీజ్ అయ్యింది. ఫుల్ మాస్ గా ఉంది.. డైలాగ్స్ నుంచి ప్రతి సీన్ యాక్షన్ అండ్ ఎమోషన్ గా సాగింది. ఫైటింగ్స్ అయితే ఓ రేంజ్ లో కనిపిస్తున్నాయి. తాగి మర్చిపోవటం తప్పుకాదు.. తప్పు చేసి మర్చిపోవటం తప్పు అంటూ హీరో క్యారెక్టర్ ను హైలెట్ చేస్తుంది. చిల్లరగా తిరిగే హీరో ధరణి పాత్ర మొత్తం సింగిల్ హ్యాండ్ లో సినిమాను నడిపించినట్లు ట్రైలర్ చూస్తే అర్థం అవుతుంది. స్టార్టింగ్ లో బతుకమ్మ సంబరం దగ్గర కనిపించిన హీరోయిన్ కీర్తి సురేష్.. చివర్లోనే కనిపిస్తుంది.

ఇప్పుడు కత్తిని పట్టినావ్ అంటే.. ఏ తోవలో పోతున్నావో అర్థం అవుతుందా అనే డైలాగ్ వింటుంటే.. లీడర్ గా ఎదిగే పాత్ర అని స్పష్టం అవుతుంది. ఓ గ్రామంలో జరిగే యుద్ధాన్ని గుర్తు చేస్తుంది ట్రైలర్.. కార్మికుల పక్షాన నిలిచే లీడర్ గా హీరో నాని ఎదిగే విషయంలో ఎదురయ్యే పోరాటాలను తెరపై చిత్రీకరించినట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తుంది.పురాణాలను మించిన బతుకులా మనవి అనే డైలాగ్స్ చూస్తుంటే.. మూవీలో దమ్ము కనిపిస్తుంది.

మొత్తానికి దసరా మూవీ ట్రైలర్ మాత్రం పక్కా రా అండ్ మాస్ యాక్షన్ కమర్షియల్ గా కనిపిస్తుంది.

నాచురల్ స్టార్ నాని హీరోగా, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం లో తెరకెక్కిన.. రా అండ్ విలేజ్ యాక్షన్ మూవీ దసరా ట్రైలర్ వచ్చేసింది. చెప్పినట్లే.. అనుకున్నట్లే ట్రైలర్ వీర మాస్ గా ఉంది. నాని అయితే చింపేశాడు.. ఇప్పటి వరకు అలాంటి పాత్ర చేసింది లేదు.. నాచురల్ స్టార్ గా.. సాఫ్ట్ బాయ్ లుక్ లో మాత్రమే చూసిన అభిమానులు.. దసరా ట్రైలర్ మాత్రం బీభత్సమైన మాస్ గా కనిపించాడు నాని.

దసరా మూవీలో నానికి జోడీగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. తెలుగుతో పాటు, హిందీ, కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో విడుదల కాబోతున్న ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. మార్చి 30న పాన్ ఇండియా వ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. శ్రీ లక్ష్మి వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.