
మాదాపూర్ డ్రగ్స్ కేసులో హీరో నవదీప్ పేరు రావడం సంచలనం సృష్టిస్తోంది. మాదాపూర్ డ్రగ్స్ కేసులో హీరో నవదీప్ పేరును హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ బయటపెట్టారు. అయితే డ్రగ్స్ కేసులో తన పేరు బయటకు రావడంపై హీరో నవదీప్ స్పందించాడు. మాదాపూర్ డ్రగ్స్ కేసుకు తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పాడు. తాను పరారీలో ఉన్నట్లు వస్తున్న వార్తలను ఖండించాడు. తాను ఎక్కడికి పారిపోలేదని..ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఉన్నానని స్పష్టం చేశాడు నవదీప్.
Also Read :- డ్రగ్స్ కేసులో హీరో నవదీప్.. అరెస్ట్ కోసం పోలీసులు గాలింపు
మాదాపూర్ డ్రగ్స్ కేసులో సీపీ సీవీ ఆనంద్ ప్రెస్ మీట్ చూసినట్లు హీరో నవదీప్ వెల్లడించారు. అందులో సీపీ సీవీ ఆనంద్ ..నవదీప్ అని మాత్రమే మెన్షన్ చేశారని..హీరో నవదీప్ అని చెప్పలేదన్నాడు. వేరే నవదీప్ అయి ఉంటాడని తెలిపాడు. ఈ మేరకు ట్విట్టర్ లో హీరో నవదీప్ స్పందించారు. అది నేను కాదు జెంటల్మెన్..నేను ఇక్కడే ఉన్నానని..ముందు క్లారిటీ తెచ్చుకోండి థ్యాంక్స్ అటూ పోస్ట్ పెట్టారు.
That's not me gentlemen
— Navdeep (@pnavdeep26) September 14, 2023
I'm right here .. pls clarify thanks