
యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నవీన్ పోలిశెట్టి(Naveen polishetty)కి జాతిరత్నాలు(Jathirathnalu) హిట్ తరువాత ఫాలోయింగ్ ఫుల్లుగా పెరిగిపోయింది. ఆయనతో సినిమాలు చేయడానికి మేకర్స్ తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అంతేకాదు పలు బ్రాండ్స్ కూడా అంబాసిడర్ గా నవీన్ ను తీసుకుంటున్నాయి. ఇందులో భాగంగా ఇటీవల ట్విల్స్ అనే ఫ్యాషన్ బ్రాండ్ నవీన్ ను తమ బ్రాండ్ అంబాసిడర్ గా ప్రకటించింది.
అదే విషయాన్ని నవీన్ పోలిశెట్టి వివరిస్తూ ఓ ట్వీట్ చేశారు.. భారతదేశంలోని ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్‌లలో ట్విల్స్ ఒకటి. వారి బ్రాండ్ అంబాసిడర్‌గా చేయడం చాలా సంతోషంగా ఉంది. ట్విల్స్ X నవీన్ పోలిశెట్టి కలెక్షన్ ప్రస్తుతం వారి అన్ని స్టోర్‌లలో అందుబాటులో ఉంది. ఆ కలెక్షన్ కోసం ఇప్పుడే మీ దగ్గరలోని ట్విల్స్ స్టోర్‌కి వెళ్లండి అంటూ రాసుకొచ్చారు నవీన్.
నవీన్ చేసిన ఈ ట్వీట్ కి ఓ నెటిజన్ స్పందిస్తూ.. మీరు వేసుకున్న షర్ట్ చాలా బాగుంది. అది గిఫ్ట్ గా ఇవ్వొచ్చు కాదన్నా. కనీసం అది ఎక్కడ దొరుకుతుందో లింక్ అయినా ఇవ్వన్నా అంటూ రీట్వీట్ చేశాడు. దానికి నవీన్రి యాక్ట్ అవుతూ.. చొక్కానే పంపిస్తాను ని కాంటాక్ట్ డీటెయిల్స్ సెండ్ చేయమని అడిగాడు. చెప్పినట్లుగానే తన ఫ్యాన్ కి ఆ షర్ట్ ను బహుమతిగా పంపించారు నవీన్.
తన అభిమాన నటుడు తనకోసం షర్ట్ పంపించడంతో.. ఫుల్ ఖుషీ అవుతూ.. థాంక్ యు నవీనన్నా.. మీ మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మూవీ పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను అని ట్వీట్ చేసాడు. దానికి నవీన్ స్పందిస్తూ .. యూ ఆర్ వెల్ కమ్' అని రిప్లై కూడా ఇచ్చారు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.