
స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి(Anushka shetty), యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి(Naveen polishetty) కాంబోలో వస్తున్న లేటెస్ట్ కామెడీ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి(Miss shetty mister polishetty). యూవీ క్రియేషన్స్(UV Creations) నిర్మిస్తున్న ఈ సినిమాను కొత్త దర్శకుడు మహేష్(Mahesh) తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ప్రమోషన్స్ పనుంల్లో ఫుల్ బిజీగా గడుపుతున్నారు. ఇందులో భాగంగానే వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు చిత్ర యూనిట్.
తాజాగా హీరో నవీన్ పోలిశెట్టి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా నవీన్.. సినిమా గురించి, అనుష్క గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు. నవీన్ మాట్లాడుతూ.. షూటింగ్ మొదట్లో అనుష్క లాంటి స్టార్ హీరోయిన్ పక్కన నటించడం కాస్త భయంగా అనిపించింది. అందుకే ముందు 2, 3 రోజులు కాస్త ఇబ్బంది పడ్డాను. ఆ తర్వాత అనుష్క ఇచ్చిన కంఫర్ట్ వల్ల ఎలాంటి భయం లేకుండా నటించగలిగాను. ఈ సినిమా వల్ల మేమిద్దరం చాలా మంచి ఫ్రెడ్స్ అయ్యాం. సినిమాలో కూడా మా ఇద్దరి కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయింది. సినిమా చూశాక ఆడియన్స్ కూడా అదే ఫీలవుతారు.
ఇక అనుష్క స్టార్ హీరోయిన్ అండ్ మీకన్న సీనియర్ కదా మరి ఆమె నుండి మీరేమ్ నేర్చుకున్నారని యాంకర్ ప్రశ్నించగా.. దానికి సమాధానంగా నవీన్ స్పందిస్తూ. అనుష్క నుండి కౌగిలింతలు నేర్చుకున్నాను. ఆమె సెట్స్ లో అడుగుపెట్టగానే టెక్నీషియన్స్ అందరికి ఓ హగ్ ఇస్తుంది అనుష్క. అది మనలో ఎంతో పాజిటివ్ ఫీలింగ్ ను ఇస్తుంది. అనుష్కలో ఉన్న మంచి క్వాలిటీస్‌లో ఇదొకటి. అందుకే ఆమె నుండి అందరికి హగ్స్ ఇవ్వడం నేర్చుకున్నాను అంటూ చెప్పుకొచ్చాడు నవీన్.