Nikhil Karthikeya: డాక్టర్ కార్తికేయ అడ్వెంచర్.. సీక్వెల్పై క్రేజీ అప్డేట్ ఇచ్చిన నిఖిల్

Nikhil Karthikeya: డాక్టర్ కార్తికేయ అడ్వెంచర్.. సీక్వెల్పై క్రేజీ అప్డేట్ ఇచ్చిన నిఖిల్

కార్తికేయ(Karthikeya) సినిమా హీరో నిఖిల్(Nikhil) కెరీర్ లో ఎంత ప్రత్యేకమో చెప్పాల్సిన పనిలేదు. అప్పటివరకు అటా.. ఇటా అన్నట్టుగా సాగుతున్న ఆయన ప్రయాణం ఈ సినిమాతో మలుపు తిరిగింది. దర్శకుడు చందు మొండేటి(Chandu Mondeti) తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ గా నిలిచింది. డివోషనల్ అడ్వెంచరస్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమాకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇక ఇటీవలే ఈ సినిమాకు సీక్వెల్ గా కార్తికేయ 2 వచ్చిన సంగతి తెలిసిందే. పాన్ ఇండియా లెవల్లో రిలీజైన ఈ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. శ్రీకృష్ణుడి కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా తెలుగుతో పాటు నార్త్ ఆడియన్స్ కూడా బాగా ఆకట్టుకుంది.

దీంతో బాక్సాఫీస్ దగ్గర రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి హీరో నిఖిల్ కు పాన్ ఇండియా లెవల్లో మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. ఇక కార్తికేయ 2 రిలీజ్ సమయంలోనే ఈ సినిమా మరి సీక్వెల్ కూడా ఉంటుందని ప్రకటించారు మేకర్స్. ఇక అప్పటినుండి కార్తికేయ 3 కోసం ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తన్నారు. ఇక తాజాగా కార్తికేయ 3పై అదిరిపైఅదిరిపోయే అప్డేట్ ఇచ్చాడు నిఖిల్. ఇదే విషయం గురించి ఆయన తన సోషల్ మీడియాలో వివరించాడు.. సరికొత్త సాహసం కోసం డాక్టర్ కార్తికేయ వెతుకుతున్నాడు.. త్వరలోనే మీ ముందుకు వస్తున్నాడు.. అంటూ రాసుకొచ్చాడు. 

దీంతో ఈ పోస్ట్ కాస్త వైరల్ గా మారింది. ఈ ఒక్క అప్డేట్ చూసి కార్తికేయ సినిమా ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. నిఖిల్ భయ్యా కార్తికేయ 3ని త్వరగా ఫినిష్ చెయ్ అన్నా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక నిఖిల్ సినిమా విషయానికి వస్తే.. ఇటీవలే స్పై సినిమాతో డిజాస్టర్ ను తన ఖాతాలో వేసుకున్న ఈ హీరో ప్రస్తుతం స్వయంభూ అనే హిస్టారికల్ పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. భరత్ కృష్ణమాచార్య తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో నిఖిల్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడా చూడాలి.