12 ఏళ్ల తర్వాత.. మొగల్తూరులో ప్రభాస్

12 ఏళ్ల తర్వాత.. మొగల్తూరులో ప్రభాస్

రెబల్ స్టార్ కృష్ణంరాజు సంస్మరణ సభ కోసం ఆయన సొంతూరు పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇవాళ మధ్యాహ్నం జరగనున్న ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు 12 ఏళ్ల తర్వాత హీరో ప్రభాస్ అక్కడికి చేరుకున్నారు. చాలా ఏండ్ల తర్వాత ప్రభాస్ రావడంతో ఆ ప్రాంతమంతా సందడిగా మారింది.

పెద్ద సంఖ్యలో ప్రభాస్ ఇంటికి చేరుకున్న అభిమానులు నినాదాలతో హోరెత్తించారు. ప్రభాస్ ఫొటోలతో కూడిన ప్లకార్డులను ప్రదర్శించారు. ఇక  వారం రోజుల పాటు ప్రభాస్ మొగల్తూరులోనే ఉండనున్నారు. అయితే కృష్ణంరాజు సంస్మరణ సభ సందర్భంగా లక్ష మంది అభిమానులకు భోజన ఏర్పాట్లు చేశారు. చివరగా 2010 సంవత్సరంలో తండ్రి సూర్యనారాయణ రాజు మరణించిన సమయంలో ప్రభాస్ మొగల్తూరుకు వెళ్లారు.