Rajasekhar: ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ రాజశేఖర్ హీరోగా 60 కోట్ల సినిమా!..అందులో నిజమెంత?

 Rajasekhar: ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ రాజశేఖర్ హీరోగా 60 కోట్ల సినిమా!..అందులో నిజమెంత?

ఫ్యామిలీ..లవ్..యాక్షన్..ఇలా ఏ జోనర్లో అయిన సినిమాలు చేస్తూ..అభిమానుల్లో స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న నటుడు..హీరో రాజశేఖర్(Rajasekhar).  టాలీవుడ్ టాప్ హీరోస్లో ఒకరైన రాజశేఖర్.. కెరీర్ స్టార్టింగ్లో ఎక్కువగా ఆవేశంతో కూడిన క్యారెక్టర్లో నటిస్తూ.. యాంగ్రీ యంగ్మేన్‌గా  గుర్తింపు సంపాదించుకున్నారు.

ఇప్పటికీ తన సినిమాలు చూడటానికి ఫ్యాన్స్ రెడీగా ఉన్నారు. సోలో హీరోగానే సినిమాలు చేస్తూ..విలన్ రోల్స్లో గానీ, మిగతా ముఖ్యమైన రోల్స్లో గానీ తనకు నటించడం ఇష్టం లేదంటూ చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు.

ఇపుడు  ఆ కంచెను దాటేసి సినిమాల్లో నటిస్తున్నాడు.చాలా కాలం నుంచి సరైన హిట్ ఒకటి పడకపోవడంతో..రాజశేఖర్ ఈ బిగ్ డెసిషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.అయితే రీసెంట్గా నితిన్ హీరోగా రైటర్, డైరెక్టర్ వక్కంతం వంశీ తెరకెక్కించిన ఎక్స్‌ట్రా-ఆర్డనరీ మేన్ సినిమాలో నటించాడు. ఇపుడు శర్వా హీరోగా లూజర్ వెబ్ సిరీస్ ఫేమ్ అభిలాష్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న స్పోర్ట్స్ డ్రామాలో తండ్రి పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. 

Also Read: లగ్జరీ కారు కొన్న దీప్తి సునైనా.. ఈసారి కాస్త డిఫరెంట్గా!

ఇదిలా ఉంటే..ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో రాజశేఖర్ హీరోగా ఓ సినిమా తెరకెక్కించునున్నట్లు టాక్ వినిపిస్తోంది. అంతేకాకుండా ఈ సినిమాకు రూ.60 కోట్ల బడ్జెట్ ను కేటాయించనున్నట్లు సమాచారం. ఈ సినిమాను నితిన్ స్పై సినిమాను డైరెక్ట్ చేసిన ఎడిటర్ గ్యారీ బి బీహెచ్ దర్శకత్వం వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో రాజశేఖర్ తో పాటు మరో ఇద్దరు యంగ్ హీరోస్ కూడా నటిస్తున్నట్లు టాక్.

ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్ నుంచి అధికారిక ప్రకటన వస్తే..క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనా రాజశేఖర్ సెకండ్ ఇన్నింగ్స్ కరెక్ట్ గా కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తే..తిరిగి ఇండస్ట్రీలో నిలదొక్కుకునే అవకాశాలు ఉన్నాయి. ఏమవుతుందో చూడాలి.